Sitara: ప్రిన్స్ గారాలపట్టి సితార వెండితెరపై ఎంట్రీ వెనక ఉన్నది ఎవరో తెలుసా?

Sitara: టాలీవుడ్ ‘సూపర్‌ స్టార్‌’ మహేశ్‌ బాబు, స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ప్రొడక్షన్స్,14 రీల్స్ ఎంటటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవి కానుకగా సర్కారు వారి పాట మే 12న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. దాంతో ఊపిరి పీల్చుకున్న మూవీ మేకర్స్ ఇప్పుడు ఆ చిత్రంలోని పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్య రిలీజ్ అయిన కళావతి సాంగ్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వినూత్నమైన స్టెప్పులతో ప్రిన్స్ మరోసారి ఆడియెన్స్‌ను ముగ్గులో దింపేటట్టు ఉన్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉండగా సర్కారు వారి పాట సినిమాతో తన కూతురు సితారను కూడా మహేశ్ బాబు వెండితెరకు పరిచయం చేయనున్నారని సమాచారం. ఈ సినిమాలోని పెన్నీ అనే సాంగ్‌లో మహేష్ బాబుతో పాటుగా సితార కూడా కన్పించడంతో సూపర్ స్టార్ అభిమానులకు అవధులు లేకుండా పోయాయి. ఇక ఆమె సడన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం వెనుక ఉన్న కారణాలను గనక పరిశీలిస్తే అందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంగీతం చేకూరుస్తున్న తమన్, సితార కళావతి పాటకు చేసిన డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయారట. కాగా అప్పటికే పెన్నీ పాటలో ఓ చిన్న పిల్లను పెట్టాలని చూస్తున్న తమన్‌కి, ఎవరో ఎందుకు సితారనే ఎంటర్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి, అదే విషయం మహేశ్‌తోనూ ప్రస్తావించగా, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సితార భారీ ఛాన్స్ కొట్టేసింది. ఇంకేముందీ అనుకున్నదే తడవుగా సితారను పెన్నీ సాంగ్‌లో పెట్టి ప్రోమో విడుదల చేయగా విపరీతమైన రెస్పాన్స్ రావడంతో మూవీ మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.