అప్పటి స్టార్ హీరోయిన్ మరణంతో జగపతిబాబు ఎందుకు చనిపోవాలనుకున్నాడో తెలుసా?

హీరో జగపతిబాబు కుటుంబ కథా చిత్రాల్లో అద్భుతంగా నటించి ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.జగపతిబాబు ఒకానొక దశలో అగ్ర హీరోలతో పోటీపడి సినిమాల్లో నటించేవారని ఇండస్ట్రీలో స్థిరపడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెబుతుంటారు. జగపతిబాబు విలక్షణమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో జగపతిబాబు సౌందర్య నటించిన అన్ని చిత్రాలు అద్భుత విజయాన్ని అందించడంతో వీరి కాంబినేషన్లో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరిచేవారు.

జగపతిబాబు హీరోయిన్ సౌందర్య కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు సక్సెస్ సాధించి చాలా సినిమాలు వంద రోజులు పైగా థియేటర్లలో సందడి చేశాయని, సౌందర్య జగపతిబాబు మధ్య ఉన్న రిలేషన్ గురించి తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌందర్య కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించింది మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌందర్య జగపతిబాబు వీరిద్దరూ మంచి స్నేహితులు.సౌందర్య అకాల మరణంతో జగపతిబాబు తీవ్రంగా కుంగిపోయాడు.ఒకానొక దశలో సౌందర్య లాంటి స్నేహితులు పోయిన తర్వాత నేనెందుకు ప్రాణాలతో ఉండాలంటూ జగపతిబాబు చాలా సందర్భాల్లో అన్నాడని రామారావు తెలియజేశారు.

అలాగే జగపతిబాబు అంత పెద్ద స్టార్ అవుతారని ఎవరు అనుకోలేదని చాలా కష్టపడి ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ ఆయన చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఈ సందర్భంగా రామారావు తెలియజేశారు.ముఖ్యంగా జగపతిబాబు సినిమా షూటింగ్ కు ఎవరైనా స్నేహితుల వచ్చారంటే తన సొంత డబ్బుతోనే వారికి ఖర్చు చేసే వారిని తెలిపారు. కేవలం ప్రొడ్యూసర్ల పైన భారం పడకుండా ఉండేందుకు జగపతిబాబు అలా ఆలోచించేవారని తెలిపారు. హీరోగా పై స్థాయికి ఎదిగిన తర్వాత విలన్ గా చేయడం అంటే అంత సులువైన విషయం కాదు. అది ఒక్క జగపతిబాబు కే సాధ్యమైందంటూ సీనియర్ జర్నలిస్ట్ రామారావు ప్రేక్షకులకు తెలియజేశారు.