Mounika Bhuma: భూమా మౌనిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా…ఆమె ముందు దిగదుడుపే!

Mounika Bhuma: మంచు మోహన్ బాబు కుటుంబ గొడవలు కాస్త సర్దుమనగాయని తెలుస్తుంది. గత నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున ఈ కుటుంబంలో గొడవలు చోటు చేసుకోవడంతో ఆ గొడవలకు కారణం భూమా మౌనిక పేరు బయటకు వచ్చింది. మౌనిక కారణంగానే మనోజ్ తాగుడికి అలవాటు పడ్డారని ఇలా తాగి వచ్చి తను ఇంటిపై గొడవకు దిగారు అటు మోహన్ బాబు తెలిపారు.

భూమా మౌనిక రాకతో తన ఇంట్లో గొడవలు చోటు చేసుకున్నాయని మోహన్ బాబు చెప్పగా తన రాకతో నా జీవితంలో మార్పు వచ్చిందనీ మనోజ్ తెలుపుతున్నారు. ఇకపోతే ఆస్తి కోసమే వీరు గొడవ పడుతున్నట్లయితే మౌనిక ఆస్తి ముందు మంచు కుటుంబం కూడా పనికిరాదని చెప్పాలి ఆమె పేరు మీదనే సుమారు 2000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.

తన తండ్రి నుంచి వారసత్వంగా భూమా మౌనికకు వచ్చిన ఆస్తుల విలువ 2000 కోట్లు కాగా ఆమె మొదటగా గణేష్ రెడ్డి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయనతో వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటికి ఒక బాబు కూడా ఉండడంతో భరణం కింద మౌనిక సుమారు 250 కోట్ల రూపాయల వరకు డబ్బులు తీసుకున్నారని తెలుస్తుంది.

ఇలా ఈమెకు ఆస్తుల విషయంలో డబ్బు విషయంలో ఏమాత్రం కొదువు లేదు కానీ మరి మంచు కుటుంబంతో గొడవ ఎందుకు అంటూ కూడా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇక మనోజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తతో కలిసి ఒక టాయ్ కంపెనీ కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నమస్తే వరల్డ్ అనే పేరిట హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో బొమ్మల షాపు పెట్టడమే కాకుండా ఆ బాధ్యతలన్నింటిని మౌనిక చూసుకుంటున్నారని ఇటీవల మనోజ్ తెలిపిన సంగతి తెలిసిందే.