సమంత పాటించే మూడు సూత్రాలేమిటో తెలుసా…?

సమంత తాజాగా తన ప్రస్తుత పరిస్థితి, ఫ్యూచర్‌ ప్రాజెక్టుల గురించి చెప్పింది. ఇక యువతకు సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. తన జీవితంలో పాటించే మూడు సూత్రాలను తెలిపింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. తన ఫ్రెండ్‌ వెన్నెల కిషోర్‌కు లవ్యూ ఫర్‌ ఎవర్‌ అంటూ చెప్పిన విషెస్‌ హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ మీద ఇంకా ఎలాంటి ప్లాన్స్‌ లేవు.. ఇంకా ఏదీ ఫిక్స్‌ కాలేదు.. కానీ చాలా సెలెక్టివ్‌గా చేస్తాను.. నా కంఫర్ట్‌ జోన్‌కు అవతల ఉండే సినిమాలే చేస్తాను అని సమంత చెప్పుకొచ్చింది. యాక్షన్‌ అడ్వెంచర్లు చేయాలని ఉంటుంది.. సిటాడెల్‌లో అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్సులుంటాయి.. షూటింగ్‌ చేయడం ఎంతో కష్టంగా అనిపించింది.

కానీ ఎంతో ఇష్టంగా చేశాను.. అని సమంత చెప్పుకొచ్చింది. సమంత పాటించే మూడు సూత్రాలు ఇవేనట. ఏం జరిగినా దాని నుంచి బయటకు రావాలి.. ప్రశ్నించడం మానేయాలి.. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది.. నిజాయితీ, సత్యం అనే వాటితో ముందుకు వెళ్లాలి అనే వాటిని సమంత పాటిస్తుందట. యూత్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వండి అని సమంతను ఓ నెటిజన్‌ అడిగారు.

నేను వారిని తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడగలను అని అనుకుంటున్నాను.. అయ్యో ఇక నా జీవితం ఇంతే.. అంతా అయిపోయింది దేవుడా? అని బాధపడుతుంటారు.. కానీ అది మీకు జరిగే నష్టం కానే కాదు.. అలాంటప్పుడే మీ జీవితం స్టార్ట్‌ అయినట్టు.. మీ రు వెళ్లే దారిలో ఎన్నో అడ్డంకులు, కష్టాలు వస్తాయి.. తప్పవు.. వాటిని ఎదుర్కోవాల్సిందే.. వాటిని ఎదుర్కొనే తరుణంలో మీరే స్ట్రాంగ్‌ అవుతారు.. అంత శక్తి మీలో ఉందని కూడా మీరు తెలుసుకోలేరు.. నాక్కూడా అదే జరిగింది.. 25 ఏళ్లకు నేను ఇలా వస్తాను అని నిలబడతాను అని అనుకోలేదు.. నా జీవితంలో జరిగిన పరిస్థితులను ఎదుర్కొన్నాను.. నేను ఇంత స్ట్రాంగ్‌గా, ధైర్యంగా ఒకప్పుడు ఉండేదాన్ని కాదు.. జీవితమంటే అదే అంటూ సమంత చెప్పుకుంటూ పోయింది.

ఇక సమంత తన ఫ్రెండ్‌ వెన్నెల కిషోర్‌కు లవ్‌ యూ ఫర్‌ ఎవర్‌ అంటూ విషెస్‌ చెప్పిన పోస్ట్‌ కూడా వైరల్‌ అవుతోంది!