మెగా వారసుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈయన కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత విషయంలో మాత్రం పిల్లల గురించి తరచూ ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొనేవారు. రామ్ చరణ్ ఉపాసన అనే అమ్మాయిని ప్రేమించి 2012వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగిన పది సంవత్సరాలకు ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ విధంగా రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియడంతో ఎంతోమంది వీరికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఉపాసన రాంచరణ్ పెళ్లైన పది సంవత్సరాలకు పిల్లలను ప్లాన్ చేయడానికి కారణం ఉందని తెలుస్తుంది. వ్యక్తిగతంగా వీరిద్దరూ కెరియర్ పరంగా కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నారని అయితే ఇప్పుడు ఆ లక్ష్యాలను చేరుకోవటం వల్ల పిల్లల గురించి ప్లాన్ చేశారని సమాచారం.
ఇలా ఈ విషయం గురించి రాంచరణ్ ఉపాసన దంపతులకు కూడా పలుమార్లు వెల్లడించారు. అయితే తరచూ తనకు ఇదే ప్రశ్న ఎదురవడంతో ఒకానొక సమయంలో ఉపాసన ఈ విషయం గురించి కాస్త ఘాటుగా స్పందించారు.అయితే ప్రస్తుతం ఉపాసన తల్లి కాబోతుందని తెలియడంతో మెగా అభిమానులలో ఎంతో ఆత్రుత నెలకొని బుల్లి రామ్ చరణ్ లేదా బుల్లి ఉపాసన జన్మించబోతున్నారని మెగా వంశవృక్షం పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.