స్టార్ డైరెక్టర్ ని భయపెట్టిన మోహన్ బాబు.. కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మోహన్ బాబు గురించి తెలియదు. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించిన మోహన్ బాబు తన నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా గుర్తింపు పొందాడు. మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టినప్పటికీ మోహన్ బాబు లాగా స్టార్ హీరోలుగా గుర్తింపు పొందలేకపోయారు. ఎన్నో సినిమాలలో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మోహన్ బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకపాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇటీవల సన్ ఆఫ్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మోహన్ బాబు హిట్ అందుకోలేకపోయాడు.

ఇదిలా ఉండగా ఇటీవల మోహన్ బాబు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా మోహన్ బాబు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ప్రతి పని తాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్న నిబద్ధతతో పనిచేస్తూ ఉంటాడు. అందువల్ల సినిమాల షూటింగ్ సమయంలో కూడా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అనుకున్న సమయానికి షూటింగ్ జరగకపోతే మోహన్ బాబు సెట్ లో ఉన్న దర్శక నిర్మాతల మీద సీరియస్ అయ్యేవాడు. అందువల్ల మోహన్ బాబు ని చూసి చాలామంది దర్శక నిర్మాతలు భయపడేవారు. అలాగే మోహన్ బాబుని చూసి ఒక స్టార్ డైరెక్టర్ కూడా భయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందిన రాఘవేంద్రరావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ సినిమాలను అందించిన రాఘవేంద్రరావు స్టార్ దర్శకుడుగా గుర్తింపు పొందాడు. మోహన్ బాబు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. మోహన్ బాబుతో కలిసి షూటింగ్ చేసే సమయంలో రాఘవేంద్రరావు భయపడుతూ షూటింగ్ చేసేవాడని సమాచారం. సమయానికి తగ్గట్టు ఎంతో క్రమశిక్షణగా పనిచేసే మోహన్ బాబు షూటింగ్ ఆలస్యం అయితే తిడతారన్న భయంతో రాఘవేంద్రరావు ఆయనతో పని చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న ఇతర హీరోలతో పని చేసే సమయంలో ఎంతో కూల్ గా ఉండే రాఘవేంద్రరావు… మోహన్ బాబుతో పని చేసే సమయంలో మాత్రం చాలా టెన్షన్ పడే వారని వార్తలు వినిపిస్తున్నాయి.