తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన కుటుంబ ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయో మనకు తెలిసిందే. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎక్కువ భాగం సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇకపోతే ఎప్పుడు కమర్షియల్, కుటుంబ కథా చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈయన దర్శకత్వంలో ఒకే ఒక జానపద చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇకపోతే ఈ జానపద చిత్రం నందమూరి తారక రామారావు గారికి కూడా ఆఖరి జానపద చిత్రమని చెప్పాలి. 1978లో తిరుపతి ప్రొడక్షన్స్ ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా సింహబలుడు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో గిరిబాబు నిర్మాణ సారధ్యంలో కొమ్మినేని దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, లతా హీరో హీరోయిన్ గా మరో జానపద చిత్రం సింహ గర్జన షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా వాణిశ్రీ సింహ గర్జన లొకేషన్ లోకి వెళ్ళగానే తనని ఆ సినిమాలో హీరోయిన్ గా నటించమని కోరాడట అయితే ఇలా రెండు సినిమాలలో తాను నటించనని వాణిశ్రీ వెల్లడించారు.
ఇక ఈ రెండు సినిమాలు కూడా జానపద చిత్రాలు కావడం అలాగే ఒకేసారి షూటింగ్ జరుపుకోవడంతో ఈ సినిమాపై అభిమానులలో ఎంతో ఆత్రుత నెలకొంది. ఇక ఈ సినిమా నిర్మించిన గిరిబాబు ఒక రోజు ఎన్టీఆర్ ని కలిసి రెండు సినిమాలు జానపద కథ చిత్రాలు అయినప్పటికీ ఎంతో విభిన్నమైన కథాంశంతో రూపొందాయని పేర్కొన్నారట. ఇక ఈ సినిమా గురించి గిరి బాబు ఎన్టీఆర్ గారికి చెప్పడంతో ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారట. ఇక ఈ రెండు సినిమాలు 15 రోజుల వ్యవధిలో 1978లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఏకైక మొదటి జానపద చిత్రం సింహబలుడు కాగా ఎన్టీఆర్ ఆకరి జానపద చిత్రం ఇదే కావడం గమనార్హం.