KGF2 : ప్రస్తుతం ఎక్కడ చూసినా సౌత్ సినిమాల హవా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎవరి నోట విన్నా ప్రస్తుతం రెండు సినిమాల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఒక్కటి దర్శకధీరుడు రాజమౌళి తీసిన ప్రభంజనం ఆర్ఆర్ఆర్ అయితే మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సంచలన చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 2. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సునామీలు సృష్టిస్తున్నాయి.
అయితే కేజిఎఫ్ చాప్టర్ టు సినిమా బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా విజయం గురించి మాట్లాడుకుంటే మొదటగా మాట్లాడు కోవాల్సింది దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిభ. ఇక హీరో యశ్ అయితే తన పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ తో అభిమానులను మేసమె్రైజ్ చేసారు. ఇక ఇతర నటీనటుల గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా సంజయ్ దత్ ప్రకాష్రాజ్ రవీనాటాండన్ మొదలైనవారు పాత్రల్లో జీవించారని చెప్పుకోవచ్చు.
తెలుగునాట కూడా ఈ సినిమానకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయ్. ముఖ్యంగా హీరో యశ్ చెప్పే డైలాగ్ లకు వెనుక అభిమానులు ఫిదా అవుతున్నారు. డైలాగులు పవర్ ఫుల్ గా ఉండటంతో పాటు, డైలాగ్ లోని వాయిస్ అద్భుతంగా ఉంది అని అంటున్నారు అంతేకాదు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందే అని అనిపిస్తుంది కూడా… అయితే ఇంతకు హీరో యశ్ కి తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరయ్యా అంటే… అతడు మరెవరో కాదు టాలీవుడ్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రావు అలియాస్ వాసు.తమిళ్ డబ్బింగ్ సినిమాలకు హీరో పత్రాలకి ఈయనే డబ్బింగ్ చరప్తుంటారు.