మలయాళీ నటి నజ్రియా నజీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తమిళం మలయాళం ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించే మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే ఈమె రాజా రాణి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చారు. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో తన నటనతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ నటి తెలుగులో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది.
ఇలా తెలుగులో విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్న ఈమె మొదటిసారి నాచురల్ స్టార్ నానితో కలిసి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తిస్థాయి తెలుగు చిత్రం అంటే సుందరానికి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా పెద్దగా వసూలు రాబట్ట లేకపోయినా, నజ్రియా నటనతో మాత్రం మరోసారి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక తనకు భాషతో సంబంధం లేదని కథ ప్రాధాన్యత ఉంటే తాను ఏ భాష సినిమాలలో నటించడానికి అయినా సిద్ధంగా ఉన్నానని ఈమె పేర్కొన్నారు.
ఈ విధంగా సినిమాల పరంగా బిజీగా ఉన్న నజ్రియా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదిక ఈమె షేర్ చేసే ఫోటోలు రీల్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలోని తాజాగా ఈమె పసుపు రంగు చీర ధరించి ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలో ఈమె ధరించిన చీర ఏ బ్రాండ్ కు సంబంధించినది దీన్ని ధర ఎంత అంటూ పెద్ద ఎత్తున నెటిజెన్లు సెర్చ్ చేస్తున్నారు. ఇక నజ్రియా నటించిన ఈ చీర తొరానీ బ్రాండ్ కు చెందినది కాక ఈ చీర ఏకంగా 64000 ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.