సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత ఆ సినిమా హిట్ అవ్వటంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించటంతో సమంత ఇమేజ్ ప్రపంచం మొత్తం పాకిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటినటించే అవకాశం దక్కించుకుంది.
కొంతకాలంగా సమంత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన సినిమాలలో నటిస్తోంది. ఈ క్రమంలో లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందిన యశోద సినిమాలో సమంత నటించింది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుండి టీజర్ విడుదల అయిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం సమంత డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా కోసం సమంత కేవలం 50 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించింది. అయినప్పటికీ ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సమంత ఈ సినిమా కోసం దాదాపు రూ. 2.75 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.సమంత అతి తక్కువ డేట్స్ ఇచ్చి ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న మొదటి సినిమా ఇది. తక్కువ డేట్స్ కి సమంత తీసుకున్న పారితోషికాల్లో ఇదే అత్యధికం అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత ఇంత కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా కూడా ఆ సినిమాల కోసం ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించింది. ఈ సినిమా కి సమంత అందుకున్న రెమ్యునరేషన్ బట్టి చూస్తే సమంతకి ఎంతటి స్టార్డం ఉందో అర్థం చేసుకోవచ్చు.