టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్.. బెస్ట్ టైమ్

సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అతని కేరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని ఏకంగా 25 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఈ మూవీ తెరకెక్కి 2021లో టాప్ హిట్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ సిద్దుకి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎ సినిమాకి స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సిద్దు జొన్నలగడ్డ అందిస్తూ ఉండటం విశేషం. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. అద్భుతం ఫేమ్ మల్లిక్ రామ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక డీజే టిల్లుకి తమన్ మ్యూజిక్ అందించారు.

అయితే టిల్లు స్క్వేర్ కి తెలంగాణ స్టార్ సింగర్ రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15న టిల్లు స్క్వేర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారంట. సెప్టెంబర్ 18న వినాయకచవితి ఫెస్టివల్ ఉంటుంది. పండగకి మూడు రోజుల ముందుగానే టిల్లు స్క్వేర్ ని రిలీజ్ చేయబోతున్నారు.

పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా ఈ టైమ్ టిల్లు స్క్వేర్ ని ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో నటిస్తోంది. ఆమె పాత్ర స్లమ్ లో ఉండే కిలాడీ పిల్లగా ఉంటుందని తెలుస్తోంది. టిల్లు, అనుపమ మధ్య రొమాంటిక్ అండ్ కామెడీ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందంట.

ఇక టిల్లు స్క్వేర్ రిలీజ్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ నందిని రెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కనున్న సినిమాలో నటించాల్సి ఉంది. ఈ మూవీ ఇప్పటికే కన్ఫర్మ్ అయిపొయింది. ఇక టిల్లు స్క్వేర్ తర్వాత అఫీషియల్ లాంచింగ్ ఉంటుందని భావిస్తున్నారు.