అలాంటి సీన్స్ లో నటించినందుకు విమర్శల పాలైన నటి..ముందే ఊహించానంటున్న దివ్య ప్రభ!

పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ సినిమా ఈ సంవత్సరం కె ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్ ఫిక్స్ అవార్డుని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా ఇది. కనిక శృతి, దివ్యప్రభ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అనేక ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ముంబై నగరంలోని ఇద్దరు మలయాళీ నర్సుల కథతో నడిచే ఈ చిత్రంలో అజీస్ నెడుమంగడ్, ఛాయా కదమ్,మరియు హృదయ్ హారూన్ కూడా నటించారు. గతవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి సంబంధించిన ఒక లీకేజ్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఈ సినిమాలో దివ్య పాత్రకు సంబంధించిన సెమీ న్యూడ్ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమా విడుదలైన రెండో రోజే దివ్యప్రభ టాప్ లెస్ సీన్ సోషల్ మీడియాలో చక్కేర్లు కొడుతుంది. దీంతో దివ్య ప్రభ ఫోటోతో పాటు పలు ఫేస్బుక్ గ్రూపులో అసభ్యకర వ్యాఖ్యలు ప్రచారంలోకి వచ్చాయి. అంతర్జాతీయంగా భారతీయ సినిమాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన ఈ సినిమాపై బి గ్రేడ్ సినిమా స్థాయిలో కొందరు చర్చించుకోవడం సిగ్గుచేటని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ సంఘటనపై నటి దివ్య ప్రభ స్పందిస్తూ ఈ చిత్రం కేన్స్ లో అవార్డును గెలుచుకుంటుందని తాను ఊహించలేదని అయితే ఈ వివాదాలను మాత్రం ఊహించానని చెప్పుకొచ్చింది. తనకి సినిమా కథే పెద్దదని, ఇలాంటి సన్నివేశాల్లో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు ఎలాంటి సీన్లు చేయలేదు కానీ కథ సాఫీగా సాగాలంటే ఇలాంటి సన్నివేశాలు తప్పనిసరి అనిపించినప్పుడు దానికి తగినట్లుగా నటించాలి, అలా చేయడం పొరపాటని నేను అనుకోను అయితే కొందరు ప్రేక్షకులు దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఇలాంటి చర్యను వ్యతిరేకించే పురుషులు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అంటూ చెప్పకు వచ్చింది దివ్య ప్రభ.