Disha Patani : దిశా పటానీకి ‘అదంటే’ ఇష్టమట. ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

 Disha Patani : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కంపెనీ నుంచి తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ దిశా పటానీ. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. అదే ‘లోఫర్’ సినిమా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరో. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోయేసరికి దిశాపటానీని అంతా లైట్ తీసుకున్నారు.
అయితే, దిశా పటానీ టార్గెట్ వేరే అంటోంది. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దిశా పటానీ అసలు హీరోయిన్ అవ్వాలనుకోలేదట. ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుందట. ఆమె తండ్రి, సోదరి కూడా ఆర్మీ ఆఫీసర్లుగా ఉన్నత స్థానాల్లో వున్నారు. అదే ఇన్సిప్రేషన్‌తో తాను కూడా ఆర్మీలో చేరాలనుకుందట.
యాక్షన్ అంటే ఎంతో ఇష్టమైన దిశా పటానీ, కుంగ్ ఫూ తదితర యాక్షన్ విద్యల్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందట. కానీ, అనుకోకుండా హీరోయిన్ అయ్యిందట. అయినా తన టార్గెట్ మిస్ కాలేదంటోంది దిశాపటానీ. రియల్ లైఫ్‌లో చేయాలనుకున్న యాక్షన్ ఫీట్లూ, ఫైట్లూ రీల్ లైఫ్ కోసం చేస్తున్నానని సరిపెట్టుకుంటోంది.
అవును నిజమే, దిశా పటానీ చేసిన సినిమాల్లో చాలా వరకూ యాక్షన్ సినిమాలే కావడం విశేషం. కెరీర్ మొదట్లోనే జాకీచాన్ సినిమా ‘కుంగ్ ఫూ యోగా’లో నటించింది. తర్వాత ‘మలంగ్’, ‘బాఘీ 2’, ‘బాఘీ 3’ తదితర సినిమాల్లో నటించింది. రీసెంట్‌గా ‘రాధే’లో సల్మాన్ ఖాన్ సరసన నటించి మెప్పించింది.  ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘యోధా’ చిత్రాలు కూడా పక్కా యాక్షన్ థ్రిల్లర్లు కావడం విశేషం.