బాక్సాఫీస్ : నాలుగో రోజు డిజాస్టర్ వసూళ్లతో “ఖుషి”..!

టాలీవుడ్ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన తాజా చిత్రం “ఖుషి” మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే టాలీవుడ్ లో ఒక మంచి ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ఇది నిలిచింది. అయితే మొదటి మూడు రోజులు కూడా ఈ చిత్రం దుమ్ము లేపే వసూళ్ళని తెలుగు స్టేట్స్ సహా యూఎస్ లో కూడా భారీ వసూళ్లు అందుకోగా.

ఇపుడు నిన్న సోమవారం అసలు టెస్ట్ లోకి ఐతే వచ్చింది. కాగా ఈ చిత్రం అప్పుడు వరకు ఉన్న ఫామ్ అంతా కూడా ఒక్కసారిగా అయితే కుప్పకూలిపోయినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. షాకింగ్ అంశం ఏమిటంటే నిన్న సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖుషి ఒక కోటి రూపాయల లోపే షేర్ అందుకుంది అని అంటున్నారు.

అయితే ఇది మాత్రం ఓ దారుణమైన డౌన్ ఫాల్ అని చెప్పాలి. మొదటి మూడు రోజుల స్టాండర్డ్ వసూళ్లు చూసి అంతా కూడా లాంగ్ రన్ లో ఖుషి కుమ్మేస్తుంది అనుకున్నారు. కానీ ఊహించని విధంగా నాలుగో రోజు ఘోరంగా సినిమా విఫలం అయ్యింది అని ట్రేడ్ పండితులే షాక్ అవుతున్నారు.

ఇందుకు కారణం ఏంటి అనేది కూడా చాలా మందికి అర్ధం కావట్లేదు. మరి ఖుషి ఈ ఊహించని డౌన్ మళ్ళీ పుంజుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాలి లేకపోతె కొంతమేర నష్టాలు ఈ సినిమాకి తప్పవని చెప్పాలి. మొత్తానికి అయితే ఖుషి కి ముగింపు ఏదో తేడాగానే ఉంది.