పవన్ కి ఒక దణ్ణం..రెండో సినిమా ప్లాన్ చేసుకుంటున్న క్రిష్??

hariharaveeramallu-views-1024x768

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు మరియు రాజకీయాల్లో బిజీగా ఉండగా ఈ చిత్రాల్లో అయితే ఇపుడు రెండు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండగా ఈ చిత్రాల్లో అయితే మూడో సినిమా విషయం చాలా మంది ఇప్పుడు మర్చిపోయే పరిస్థితి.

కాగా ఆ సినిమానే “హరిహర వీరమల్లు”. మరి ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించగా ఈ సినిమా సుమారు 60 శాతం మేర కంప్లీట్ అయ్యింది. కానీ ఈ సినిమా మొదలై మూడేళ్లు అయినప్పటికీ ఇంకా ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. అయితే హీరో ఏమన్నా చిన్న హీరోగా ఏమన్నా అందాం అంటే.. అలా కుదరదు.

అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలోనే దర్శకుడు క్రిష్ హీరో వైష్ణవ్ తేజ్ తో కొండ పొలం అనే సినిమా చేసి రిలీజ్ చేస్తే అది వచ్చి ఇప్పుడు ఏడాది కంప్లీట్ అయ్యిపోయింది. అయినా వీరమల్లు అలాగే ఉండిపోయింది. ఇక ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ గ్యాప్ రావడంతో క్రిష్ ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీనితో క్రిష్ రెండో సినిమా స్టార్ట్ చేయాలని చేస్తున్నారట. కాగా ఈ చిత్రం దర్శకుడు స్టార్ హీరోయిన్ అనుష్కతో అయితే సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. దీనితో మాత్రం పవన్ తో సినిమా పనులు పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని మళ్లీ నిరూపితం అయ్యింది.