అనుష్క శెట్టి తన బర్త్ డే రోజు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకి భారీ షాకిచ్చింది. తెలుగు తో పాటు తమిళ అభిమానులు అనుష్క నుంచి బర్త్ డే సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కాని ఒక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్‌డేట్ కూడా రాకపోవడం దందరికి షాక్ కి గురి చేస్తోంది. ఇటీవలే అనుష్క నటించిన నిశ్శబ్ధం ఓటీటీలో రిలీజైంది. మొదట ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఆ తర్వాత నెమ్మదిగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
అయితే అందరూ నిశ్శబ్ధం తర్వాత నటించబోయో సినిమాని ప్రకటించడానికి బర్త్ డే వరకు అందరిని సస్పెన్స్ లో పెడుతుందని ముందు నుంచి అనుకున్నారు. అభిమానులు కూడా దాదాపు 15-20 రోజుల ముందు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. రోజూ ఏదో ఒక కొత్త కామన్ డీపీ తో హడావుడి చేశారు. అయితే బర్త్ డే వచ్చింది వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు అనుష్క తో పనిచేసిన దర్శక, నిర్మాతలు.. హీరోలు.. ఇతర సహ నటులు.. టెక్నీషియన్స్ శుభాకాంక్షకు తెలిపారు. కాని ఏ ఒక్క నిర్మాణ సంస్థ కూడా అనుష్క నటిస్తుందన్న కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు.
దాంతో నిశ్శబ్ధం తర్వాత అనుష్క ఏ కొత్త ప్రాజెక్ట్ ని కమిటవలేదని అర్థమవుతోంది. వాస్తవంగా అయితే గుణశేఖర్ తెరకెక్కించబోయో శాకుంతలం సినిమాలో అనుష్క నటించబోతుందన్న ప్రచారం జరిగింది. అలాగే కమల్ హాసన్, సూర్య నటించబోతున్న సినిమాలలో కూడా అనుష్క కమిటయిందన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ స్వీటి బర్త్ డే రోజు ప్లాన్ చేశారని అందరు భావిస్తే అన్ని గాలిలో కలిసిపోయాయని అంటున్నారు. మరి ఇక అనుష్క సినిమాలలో నటించడం లేదా.. అందరూ అనుకుంటున్నట్టు త్వరలో పెళ్ళి సిద్దమవుతుందా అన్నది క్లారిటీ లేకుండా ఉంది. చూడాలి మరి అనుష్క నుంచి త్వరలో ఇందుకు సంబంధించిన న్యూస్ ఏదైనా వస్తుందేమో.