బోల్డ్ సినిమాకు డబ్బే డబ్బు

dirty hari

ఇటీవల కాలంలో బోల్డ్ సినిమాలకు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టాక్ ఎలా ఉన్నా కూడా కాస్త బోల్డ్ గా హాట్ సీన్స్ ఉంటె చాలు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను రాబడుతున్నాయి. ఇక రీసెంట్ గా యూత్ ను ఆ విధంగా ఎట్రాక్ట్ చేసిన బోల్డ్ సినిమా డర్టీ హరి. ఈ సినిమాపై మొదట్లో ఎలాంటి అంచనాలు లేవు. సీనియర్ నిర్మాత ఎమ్ఎస్.రాజు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. 


దేవి, వర్షం, మనసంతా నువ్వే, ఒక్కడు వంటి విభిన్నమైన సినిమాలను నిర్మించిన ఎమ్ఎస్.రాజు చాలా కాలం తరువాత మళ్ళీ దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే కమర్షియల్ గా సినిమా మంచి లాభాలను అందించినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాని ఫ్రైడే మూవీస్ అనే యాప్ ద్వారా విడుదల చేశారు. విడుదలైన మొదటి రోజు నుంచి కూడా రాజుగారు ప్రమోషన్ చేసిన విధానం సినిమాకు బాగా కలిసొచ్చింది. 

మందు తాగుతూ ఈ సినిమా చూడవచ్చు అంటూ బోల్డ్ గానే ప్రమోట్ చేశారు. ఇక యాప్ లో ఒక వ్యూవ్ కి 120రూపాయాలని దాదాపు టికెట్ రేటును ఫికేస్ చేశారు. ఇక సినిమా చాలా వేగంగా వైరల్ అయ్యింది. తక్కువ సమయంలోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ ను అందించిందట. ఇక బోనస్ గా ఆ సినిమాను ఆహా యాప్ మంచి రేటుకే కొనుక్కుంది. చాలా తక్కువ ఖర్చుతో సినిమాని నిర్మించగా కరోనా కష్టకాలంలో బాగానే రాబట్టింది, ఇక జనవరి 8న డైరెక్ట్ గా థియేటర్స్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి సీజన్ కొన్ని రోజులు ఆడినా కూడా వచ్చేదంతా ఒక బోనస్ అనే చెప్పాలి.