అడివి శేష్ కోసం రానున్న జక్కన్న.. హిట్ 2 ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా రాజమౌళి?

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ మీనాక్షి చౌదరి జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం హిట్ 2. ఈ సినిమా హిట్ చిత్రానికి సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శైలేష్ దర్శకత్వంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న హిట్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రంలో హీరో విశ్వక్ కి బదులుగా శేష్ నటిస్తున్నారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ రెండవ తేదీ 12వ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇకపోతే ఈ సినిమాకి నాని నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నవంబర్ 28వ (నేడు) తేదీ హైదరాబాదులో ఈ సినిమా సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేశారు.ఇకపోతే ఈ వేడుకలో భాగంగా ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొనబోతున్నారనే విషయం గురించి సందేహాలు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి హాజరు కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా ప్రకటించారు. వైజాగ్ లో ఓ అమ్మాయి పై జరిగిన హత్యాచార ఘటన నేపథ్యంలో ఈ సినిమా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ ట్రైలర్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచింది. ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.