హనుమాన్‌ విజయంపై దర్శకేంద్రుడి శుభాకాంక్షలు!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద నాలుగు సినిమాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. అన్ని సినిమాలు హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతున్నాయి. సంక్రాంతి అనేది సినిమాల పండగ కూడా కావడంతో.. ప్రేక్షకులు వారికి అందుబాటులో ఉన్న సినిమాని చూసేస్తున్నారు. వెంకీ ’సైంధవ్‌’ రేసులో కాస్త వెనుకపడినప్పటికీ కలెక్షన్స్‌ విషయంలో మాత్రం బాగానే స్కోర్‌ చేస్తోంది.

ఇక ’హను`మాన్‌’ బీభత్సానికి అయితే థియేటర్లే దొరకడం లేదు. హిందీ బెల్ట్‌లో కూడా ’హను`మాన్‌’ భారీగా కలెక్షన్స్‌ రాబడుతోంది. తాజాగా ఈ సంక్రాంతికి వచ్చిన ’హను`మాన్‌’, ’నా సామిరంగ’ సినిమాలపై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ట్విట్టర్‌ ఎక్స్‌ వేదికగా రియాక్ట్‌ అయ్యారు. ముందుగా ’హను`మాన్‌’ గురించి చెబుతూ.. సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్‌ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం, విజువల్‌గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు‘ అని పేర్కొన్నారు.