ఆ దర్శకుడికి చిరు మరో ఛాన్స్!

వీవీ వినాయక్ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అనడంలో అతిశయోక్తి కాదు. ఆయన సినిమాలు చూస్తే కొన్న టికెట్ కు సరిపడా వినోదం గ్యారెంటీ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం వీవీ వినాయక్ తెలుగు సినిమాలు అయితే చేయడం లేదు. తాజాగా ఈ దర్శకుడు స్టార్ హీరోతో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు… టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటికే ఠాగూర్, ఖైదీ నెంబర్ 151 వంటి చిత్రాలు తీశాడు వినాయక్. ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి.. కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే త్వరలోనే చిరుతో మరో చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారని టావీవుడ్ వర్గాల సమాచారం. గతంలో తమిళ మూవీ అజిత్ నటించిన విశ్వాసం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం అప్డేట్ కథతో చిరు దగ్గరకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆ కథకు చిరు ఓకే చెప్తే.. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోసారి ఈ దర్శకుడికి చిరంజీవి ఛాన్స్ ఇస్తున్నరని తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన విశ్వాసం సినిమానా.. లేదా కొత్త కథనా తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. అజిత్, నయనతార జంటగా నటించిన విశ్వాసం సినిమా తండ్రి, కూతుళ్ల కథతో తెరకెక్కింది. ఈ సినిమాను తమిళంలో మంచి విజయం అందుకుంది. ఇలాంటి తండ్రీ-కూతుళ్ల కాన్సెప్ట్‌కి చిరు అయితే పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారని వినాయక్‌ భావించినట్లున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రీమేక్ కథలతో చిరు వరుస సినిమాలు చేస్తున్నారు. ఎక్కడ చిరుతో మళ్లీ రీమేక్ సినిమా చేస్తారా అని మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇక ప్రస్తుతం వీవీ వినాయక్ బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి రీమేక్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇక చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అయితే చిరుతో మూవీ రీమేక్ తెరకెక్కిస్తారా.. లేదా కొత్త కథతో మూవీ తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.