బాలయ్య వీడియోతో డింపుల్ హయాతి షాకింగ్ పోస్ట్.!

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తమ మొదటి సినిమా తోనే డిజాస్టర్ అందుకున్నప్పటికీ మంచి ఫేమ్ మాత్రం అందుకున్న హీరోయిన్స్ లో డాషింగ్ హాట్ బ్యూటీ డింపుల్ హయాతి కూడా ఒకరు. మరి డింపుల్ హయాతి మొదటి సినిమా “ఖిలాడీ” తో పరిచయం కాగా తర్వాత “రామబాణం” అనే సినిమా అయితే చేసింది.

ఇది కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. కానీ గత కొన్ని రోజులు నుంచి మాత్రం ఈమె పేరు సోషల్ మీడియాలో అయితే గట్టిగా వినిపిస్తుంది. మరి రీసెంట్ గా హైదరాబాద్ లో తన దగ్గర ఏదో సమస్య ఉందని కొన్ని షాకింగ్ ట్వీట్ లు ఆమె కంప్లైంట్ కు సంబంధించి కూడా ఇవ్వడంతో ఆమె హాట్ టాపిక్ గా మారింది.

అయితే లేటెస్ట్ గా ఆమె మరో షాకింగ్ పోస్ట్ పెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇందులో బాలయ్య నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “సింహా” నుంచి బాలయ్య పోలీసులకి పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చే సీన్ అయితే పోస్ట్ చేసింది.

అయితే దీని బట్టి అర్ధం అయ్యింది ఏమన్నా ఉంది అంటే అది తన విషయంలో పోలీసులు తన కంప్లైంట్ ని పట్టించుకోకుండా ఇలా చేస్తున్నారని ఆమె చెప్తున్నట్టుగా సెటైర్ వేసింది. దీనితో ఈ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. మరి పోలీసులు అయితే ఆమె కంప్లైంట్ పట్ల ఎందుకు అశ్రద్దగా ఉన్నారో ఇతర డీటెయిల్స్ మాత్రం ఎవరికీ తెలీదు.