రెండవ పెళ్ళి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన దిల్ రాజు.. వైరల్ అవుతున్న వీడియో!

dilraju09012023_c

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు మొదట వివాహం చేసుకున్న వారికి విడాకులు ఇచ్చి రెండు, మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు కూడా 2020 సంవత్సరంలో తేజస్విని అనే యువతని రెండవ వివాహం చేసుకున్నాడు. దిల్ రాజు ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందాడు. ఇక అనారోగ్య సమస్యలతో దిల్ రాజు మొదటి భార్య మరణించిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాల పాటు దిల్ రాజు ఒంటరిగా జీవించాడు.

అయితే దిల్ రాజు కుమార్తె తన తండ్రికి రెండవ వివాహం చేయాలని పట్టుబట్టడంతో కూతురు అల్లుడి అంగీకారంతో దిల్ రాజు తేజస్విని యువతిని రెండవ వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు తన రెండవ వివాహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మాట్లాడుతూ..కూతురు, తల్లితండ్రుల బలవంతం మీద రెండవ పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించాడు. తన మొదటి భార్య అనిత మరణించిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఈ క్రమంలో వారి తల్లిదండ్రులు ఎలాగైనా తనకి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించారని తెలియజేశాడు.

ఇక ఈ క్రమంలో తేజస్విని పరిచయం అయిన తర్వాత ఏడాది పాటు ఆమెను అబ్జర్వ్ చేసి నా కుటుంబాన్ని, నన్ను జీవితంలో ఉంటే బాగుంటుంది అని ఆమెను వివాహం చేసుకున్నట్లు వెల్లడించాడు. ఎందుకంటే తను ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీ . వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా వృత్తిపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా తన పరిస్థితి మొత్తం ఆమెకు వివరించి ఆ తర్వాతనే ఆమె వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకువెళ్లానని దిల్ రాజు వెల్లడించాడు. ఇక ఇటీవల దిల్ రాజు రెండో భార్య తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి దిల్ రాజుకి వారసుడులేటి లోటు తీర్చింది.