ఆది పురుష్ ట్రోల్స్ పై స్పందించిన దిల్ రాజు

ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి చిత్రం ఆది పురుష్.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడంతో ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో వివాదాలకు కారణమైంది. కేవలం నేటిజన్స్ మాత్రమే కాకుండా..సెలబ్రిటీలు సైతం ఈ టీజర్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ 100 కోట్ల రూపాయలు డబ్బు వృధా చేసుకోవడం అవసరమా అంటూ కామెంట్ లు చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆది పురుష్ చిత్ర బృందం హైదరాబాద్ లో సందడి చేయగా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ తాను ఈ సినిమా టీజర్ విడుదల కాగానే సెల్ ఫోన్ లో చూసి వెంటనే ప్రభాస్ కి ఫోన్ చేశాను. ఆ సమయంలో ప్రభాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టాను సినిమా పక్కా హిట్ అవుతుంది ఎలాంటి ఆందోళన అవసరం లేదు వచ్చేయడాది జనవరి 12 బ్లాక్ బస్టర్ పక్కా అంటూ ఈయన వాయిస్ మెసేజ్ పెట్టినట్టు తెలిపారు.

సాధారణంగా మనం కొన్ని సినిమాలను స్మాల్ స్క్రీన్ లో చూడటానికి బిగ్ స్క్రీన్ లో చూడటానికి చాలా తేడా ఉంటుంది అయితే ఆది పురుష్ సినిమా కేవలం బిగ్ స్క్రీన్ సినిమా మాత్రమేనని దిల్ రాజు తెలిపారు. ఇలా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి సినిమా అని స్మాల్ స్క్రీన్ లో చూస్తే పెద్దగా అనిపించదు కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈయన తెలిపారు. అయితే ఇదివరకే ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా గురించి కూడా ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి. ప్రభాస్ భుజంపై శివలింగం ఎత్తుకుంటే జండుబాం పెట్టి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్. ఆది పురుష్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అంటూ దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. ఒక సినిమాని సినిమా లాగా చూసినప్పుడే అది అందరికీ నచ్చుతుందని ఈయన తెలియచేశారు.