నాని సినిమాకి సాలిడ్ ఆఫర్ ఇచ్చి కొనేసిన దిల్ రాజు??

టాలీవుడ్ సినిమా టైర్ 2 లో టాప్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది నేచురల్ స్టార్ నాని అనే చెప్పాలి. కాగా నాని హీరోగా నటించిన తాజా చిత్రం “హాయ్ నాన్న” తన కెరీర్ లో మరో మంచి హిట్ అందుకోగా ఈ సినిమా తర్వాత నాని చేస్తున్న కమర్షియల్ చిత్రమే “సరిపోదా శనివారం”.

నానితో “అంటే సుందరానికి” అనే డిజాస్టర్ తర్వాత అదే సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేస్తున్న సినిమా ఇది. అయినప్పటికీ ఈ సినిమాపై క్రేజీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అంటే సుందరానికి ప్లాప్ అయినప్పటికీ సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది కానీ తెలుగు ఆడియెన్స్ కి అంతగా ఎక్కలేదు.

దీనితో ఈ కాంబినేషన్ నుంచి మాత్రం ఈసారి పక్కా హిట్ బొమ్మ చేస్తామని నాని వివేక్ ఇద్దరూ ఫిక్స్ అయ్యిపోయారు. అలా కొత్త ప్రాజెక్ట్ ని ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు అనౌన్స్ చేయగా అప్పుడే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ఇపుడు అప్డేట్ రివీల్ అయ్యింది.

మరి ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు మంచి ధర ఇచ్చి తెలుగు రాష్ట్రాల హక్కులని కొనేసుకున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు నాని సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే మినిమమ్ 30 కోట్ల షేర్ ని రాబడుతుంది. దీనితో సరిపోదా శనివారం కి 27 కోట్ల మేర డీవీవీ వారికి చెల్లించి తెలుగు రాష్ట్రాల హక్కులు కొనేసుకున్నాడని సమాచారం. మొత్తానికి అయితే అప్పుడే సినిమా బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసేసుకుంది అని చెప్పాలి.