RRR : ఆర్ఆర్ఆర్ దిల్ రాజు కు అంత లాభం తెచ్చిందా…!

RRR : ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు మీద రికార్డులు బద్ధలుకొడుతూనే ఉంది. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఆర్ఆర్ఆర్ సంచలనమే. అటు నార్త్ ఇటు సౌత్ రెండింటిలోనూ కలెక్షన్లు దున్నేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో వసూళ్ల సునామి సృష్టిస్తున్న ఈ సినిమా ఇక టాలీవుడ్ లో 300 కోట్ల వరకు వసూలు చేసి చరిత్ర రాస్తోంది.

బ్రేక్ ఈవెన్ పాయింట్ తర్వాత సినిమా వసూళ్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా వసూళ్ల ను మరింత పెంచుకుంటూ పోతోంది. ఉగాది పండగ కలిసిరావడం తో వసూళ్లు ఊపందుకున్నాయి.ఇక కేవలం నైజాం ఏరియా లో 100 కోట్లు వసూలు చేసిందట ఆర్ఆర్ఆర్. ఇక నైజాం డిస్ట్రిబ్యూషన్ అంతా దిల్ రాజుది కావడం తో దిల్ రాజుకి మంచి లాభాలని తెచ్చిపెట్టింది.

దిల్ రాజు సినిమా ప్రొడ్యూసర్ చేస్తూ మరియు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ రెండూవైపులా లాభాలు అర్జీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం 80 కోట్లా వరకు రాజు ఖర్చుపెట్టారట.ఇక దానిపైన వచ్చేదంతా లాభామే కావున ఇప్పటికే 15 నుండి 20 కోట్లా లాభం దిల్ రాజు కు వచ్చిందని అంచనా వేస్తున్నారు.ఇలా దిల్ రాజు ఆర్ఆర్ఆర్ నిర్మాణం లో భాగం కాకపోయినా కేవలం డిస్ట్రిబ్యూషన్ తో లాభాలను పొందాడు. ఇక ఈ సక్సెస్ కు పార్టీ ఇచ్చారు దిల్ రాజు. అయితే ఆర్ఆర్ఆర్ కంటే ముందు అఖండ ఫిల్మ్ కి కూడా లాభాలు పొందడం కొసమెరుపు.