ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ‘హనుమాన్’ సినిమాపై పగబట్టేశాడు. సినిమా 12న విడుదల కావాల్సి వుండగా, 11 లేదా 14.. ఈ రెండిట్లో ఏదో ఒక తేదీ ఖరారు చేసుకోవాలని ఒత్తడి తెస్తున్నాడట.
ఏది పెద్ద సినిమా.? ఏది చిన్న సినిమా.? అన్న విషయమై దిల్ రాజు మాటలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్. చిన్న సినిమా తీసినప్పుడు, ‘ఏది బాగుంటే అది పెద్ద సినిమా’ అంటాడు. ఇప్పుడు ‘గుంటూరు కారం’ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్నాడు కదా, ‘మార్నింగ్ షో కోసం జనం ఎగబడే సినిమానే పెద్ద సినిమా’ అంటున్నాడాయన.
‘హనుమాన్’ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. దేశవ్యాప్తంగా ‘జై శ్రీరామ్’ నినాదం మార్మోగుతోంది.. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమైన దరిమిలా.
ఇది రైట్ టైమ్ ‘హనుమాన్’ సినిమాకి. సంక్రాంతి సీజన్ కూడా దానికి తెలుగునాట బాగా కలిసొస్తుంది. అన్నీ సిద్ధం చేసుకున్న సినిమా ఒక్కరోజు అటూ ఇటూ అయినా, ఫలితం తేడా కొడుతుందని ‘దిల్’ రాజుకి తెలియదా.?
నాలుగు సినిమాల్లో ఆఖరిది ‘హనుమాన్’ అంటున్నాడు దిల్ రాజు. ఎందుకు ‘హనుమాన్’ మీద దిల్ రాజు పగబట్టినట్లు.? ఇంత వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం దిల్ రాజుకి ఏమొచ్చింది.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్ అయి కూర్చుందిప్పుడు. ‘దిల్’ రాజు ఆలోచనలపై ‘హనుమాన్’ టీమ్ మాత్రమే కాదు, యావత్ సినీ పరిశ్రమ ఆశ్చర్యపోతోంది.