డిజిటల్ శ్రీముఖి సిద్ధమైన కార్తీకేయ 2… ఆ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న యంగ్ హీరో?

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మొదట సినిమా విడుదల చేయడానికి థియేటర్లు దొరక్క ఇబ్బంది పడ్డ నిర్మాతలు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనతో ఏకంగా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది.

కేవలం పాతిక కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సొంతం చేసుకొని 100 కోట్ల క్లబ్ లో చేరి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. నిఖిల్ కెరీర్లో అతిపెద్ద హిట్ సినిమాగా నిలిచిన కార్తికేయ 2 ఓటిటి రిలీజ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటిటి ఛానల్ జీ5 లో ఈ సినిమా ప్రసారం కానుందని గతంలోనే సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి . అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే అదే రోజు చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా తో పాటు నాగార్జున నటించిన ‘ది గోస్ట్ ‘ సినిమాలు కూడా దసరా కానుకగా థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఇలా దసరా పండుగ రోజున ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతు నిఖిల్ ఓటీటీ లో తన సినిమాని విడుదల చేయటం విశేషం.