శేఖర్ కమ్ములతో స్టార్ హీరోతో విభేదాలు?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ హైప్ క్రియేట్ చేస్తాడు. అయితే లవ్ స్టోరీ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ కూడా ఆయన ఫ్యాన్స్ మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు. ఇక ఇప్పుడు లీడర్ తరహాలో తమిళ హీరో ధనుష్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ ప్రాజెక్టు అయితే తప్పకుండా పాన్ ఇండియా లెవెల్లో తెరపైకి తీసుకురావాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏషియన్ గ్రూప్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మించనుంది. అయితే ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు ఊహించని విధంగా ఒక గాసిప్ అయితే వైరల్ అవుతుంది. ఇప్పటికే సినిమా విషయంలో ఒక అప్డేట్ అయితే రావాలి కానీ శేఖర్ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ముందుగా ధనుష్ కు మూల కథ చెప్పి ఒప్పించిన శేఖర్ కమ్ముల మెల్లగా ఫైనల్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవాలని అనుకున్నాడు. ఇక ఆ తర్వాత ధనుష్ తో రెండు మూడు సార్లు చర్చించగా అతను పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలేదట. ఇటీవల నాలుగువ సారి కూడా చెప్పినప్పటికీ మళ్లీ కొన్ని మార్పులు చేయాలని అడిగినట్లు తెలుస్తోంది.

దీంతో వీరిద్దరి మధ్యలో క్రియేటివ్ పరంగా కొంత విభేదాలు వచ్చినట్లుగా కూడా ఇండస్ట్రీలో టాక్ కనిపిస్తోంది. అయితే కమ్ముల ఎప్పుడు కూడా ఆ విధంగా చేసే వ్యక్తి కాదు. గతంలో కొంతమంది హీరోలు రిజెక్ట్ చేస్తే సైలెంట్ గా సైడ్ అయ్యాడు. కానీ ఈ విషయంలో మాత్రం కాస్త ఎక్కువగానే వార్తలు వైరల్ అవుతున్నాయి మరి శేఖర్ కమ్ముక ఈ విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.