ఏపీ వరద సహాయంలో ఈ విషయం గమనించారా… విరాళం వెనుక కారణం అదేనా?

గత పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు కురవడం వల్ల నెల్లూరు జిల్లాలో పాటు రాయలసీమలోని పలు జిల్లాలు వరద నీటిలో కొట్టుకు పోయాయి.ఈ క్రమంలోనే అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలలో వరద ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఎంతో మంది నిరాశ్రయులుగా మారారు. అదేవిధంగా చేతికొచ్చిన పంట చేజారి పోవడంతో గుండెలవిసేలా రోదించారు. ఇక ఎంతోమంది వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులను చూసిన ఏపీ ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఇలా వరద ప్రాంతాలలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఈ పరిస్థితులను చూసి చలించి పోయిన టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఈ సమయంలోనే ఎన్టీఆర్ బాధితుల కోసం తనవంతు సహాయంగా 25 లక్షలు విరాళం ప్రకటించారు. అనంతరం మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్ వెంటవెంటనే విరాళాలు ప్రకటించగా మరుసటిరోజు అల్లుఅర్జున్ 25 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే గీత ఆర్ట్స్ పది లక్షల సహాయం ప్రకటించారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించారు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీ పై ప్రశంసలు కురిపించారు.ఇలా ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ ప్రభుత్వం విరాళాలు అదికూడా ఒక్కొక్కరు పాతిక లక్షలు ప్రకటించడంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది ఏపీ ప్రభుత్వం టికెట్ల విషయంలో కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈ సాయం ప్రకటించడానికి ముందే ఏపీ ప్రభుత్వం టికెట్ల విషయంలో జీవో జారీ చేసిందని సమాచారం. ఇలా ఈ జీవో విడుదల చేయడంతో ఒక్కసారిగా సెలబ్రిటీలు తమ వంతుగా విరాళాలను ప్రకటించారా? అనే సందేహం కలుగుతుంది.