అలనాటి దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ చేతిలో ఉన్న ఈ చిన్నారి ప్రస్తుత సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందటమే కాకుండా ఇండియా లెవెల్ లో కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనా ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని తన అభిమానులను మార్చుకున్న ఈ స్టార్ హీరో ఇప్పటికీ 68 ఏళ్ల వయసులో కూడా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఫోటోలో ముందుగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కాదు.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన కమల్ హాసన్. 1954లో తమిళనాడులోని రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి ప్రాంతంలో కమల్ హాసన్ జన్మించాడు.
బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన కమల్ హాసన్ ఆయన నటించిన మొదటి సినిమాకే జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత జాతీయ ఉత్తమ నటుడిగా మూడుసార్లు అవార్డ్ అందుకున్నారు. కమల్ హాసన్ నటుడిగా మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్సర్ గా మంచి ప్రతిభ ఉన్నవాడు. అంతేకాకుండా రైటర్ గా కూడా మంచి ప్రతిభ ఉండటంతో ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణించాలని భావించాడు. అయితే డైరెక్టర్ కె. బాలచందర్ సూచన మేరకు నటనవైపు అడుగులు వేశాడు.
ఇక కమలహాసన్ నటించిన ఎన్నో సినిమాలు ఆయన నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ముఖ్యంగా భారతీయుడు, దశావతారం, సాగర సంగమం, ఆకలి రాజ్యం వంటి ఎన్నో సినిమాలలో కమల్ హాసన్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక ఇటీవల కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమా దేశవ్యాప్తంగా విడుదలై రికార్డు స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. చాలా కాలం తర్వాత విక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు ముందుకు వచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కమల్ హాసన్ కి ఈ సినిమా మంచి హిట్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో కమలహాసన్ బిజీగా ఉన్నాడు.