చిరంజీవి కంటే ముందుగా గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకు పెట్టిన టైటిల్ మరొక సినిమాకు పెట్టడం సర్వసాధారణం ఇలా ఎన్నో సినిమాలు ఒకే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలా సీనియర్ హీరోలు నటించిన సినిమా టైటిల్ ను తన సినిమా టైటిల్ కు పెట్టుకున్నారు. అదేవిధంగా చిరంజీవి నటించిన సినిమా టైటిల్స్ కూడా ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా టైటిల్ కూడా ఇదివరకే ఒక సీనియర్ హీరో నటించారు. అయితే ఆ హీరో ఎవరు? ఆ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంది అనే విషయానికి వస్తే…

చిరంజీవి కన్నా ముందుగా గాడ్ ఫాదర్ టైటిల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు.ఏఎన్ఆర్ వినోద్ కుమార్ హీరోలుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అప్పట్లో మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఎంతో అద్భుతమైన హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాని మలయాళంలో తెరకెక్కించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.