తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ స్వయం కృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట విలన్ పాత్రలలో నటిస్తూ అనంతరం హీరోగా అవకాశాలను అందుకున్నారు.ఇలా స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొంటూ అంచలంచలుగా ఎదుగుతూ నేడు టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయిలో చిరంజీవి ఉన్నారని చెప్పాలి.
ఇకపోతే చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే చిరంజీవి తండ్రి వెంకట్రావు సైతం నటనపై ఆసక్తితో సినిమాలలో నటించారు. అయితే ఈయన కూడా సినిమాలలో నటించారని చాలామందికి తెలియదు. చిరంజీవి తండ్రి ఏ సినిమాలో నటించారు అనే విషయానికి వస్తే… బాపు గారి దర్శకత్వంలో చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడనే సినిమాలో నటించారు.అదేవిధంగా చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందే జగత్ కిలాడీలు అనే సినిమాలో కూడా నటించారు.
ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో చిరంజీవి తండ్రి కూడా నటించారు.అయితే ఈయన వృత్తి రీత్యా కానిస్టేబుల్ కావడంతో కుటుంబం కోసం ఉద్యోగ నిమిత్తం ఈయన తనకెంతో ఇష్టమైన సినిమా రంగాన్ని వదిలి ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారు. ఇలా ఈయన మాదిరిగానే తన కుమారుడు చిరంజీవికి సైతం నటనపై ఆసక్తి ఉండడంతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో కష్టపడుతూ ఇండస్ట్రీలో కొనసాగుతూ అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.