మహేష్ బాబును పడేయటానికి హీరోయిన్లు ట్రై చేశారా.. వైరల్ అవుతున్న మహేష్ కామెంట్స్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు పలు సినిమాలలో కలిసిన నటించడం వల్ల వారి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. ఈ విధంగా ఎంతోమంది హీరోలు హీరోయిన్లతో ఎఫైర్ నడుపుతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక మరి కొంతమంది హీరోలు ఎలాంటి చిన్న మచ్చ కూడా లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రిన్స్ మహేష్ బాబుకి ఎంతోమంది అభిమానులు.

ఈయన నటన పరంగా మాత్రమే కాకుండా ఈయన అందానికి ఎంతోమంది ఫిదా అవుతుంటారు.ఇక మహేష్ బాబు కూడా ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించినప్పటికీ ఈయనకు ఏ హీరోయిన్ తో కూడా అఫైర్స్ ఉన్నాయనే వార్తలు ఎప్పుడు వినిపించలేదు. ఇక ఈయన హీరోయిన్ నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకుని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే గతంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మహేష్ బాబును యాంకర్ ఓ ప్రశ్న వేశారు. మీరు చూడటానికి ఇంత అందంగా ఉన్నారు కదా మిమ్మల్ని పడేయాలని ఏ హీరోయిన్ ట్రై చేయలేదా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ మనం పర్ఫెక్ట్ గా మన పని మనం చేసుకుంటూ పోతున్నప్పుడు మన గురించి ఎవరు ఎలాంటి వార్తలు రాయారని అలాగే ఎవరు మన జోలికి రారని సమాధానం చెప్పారు.ఇక ఈయన చెప్పిన సమాధానం చూస్తుంటే మన వైపు నుంచి ఏ విధమైనటువంటి అలసు లేకపోతే ఎవరూ కూడా మన జోలికి రారని మహేష్ చెప్పకనే చెప్పేశారు. ఇదే ప్రశ్న మీ భార్య నమ్రత ఎప్పుడైనా అడిగారా అంటూ యాంకర్ ప్రశ్నించగా అలాంటి సిల్లి ఆలోచనలు తన భార్య నమ్రతకు రావని మహేష్ చాలా సింపుల్ గా సమాధానం చెప్పారు.