Ram Charan : రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నాడా…?

Ram Charan : రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా, దర్శక ధీరుడు రాజమౌళి ధర్షకత్వం వహించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు సంచలన విజయాన్ని అందించడమే కాకుండా వారిని పాన్ ఇండియా స్టార్ లుగా మార్చింది. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆచార్య, ఇంకా శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు. ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా వుంది.

శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో15వ చిత్రంగా తెరకేక్కుతోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కైరా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్  ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.అయితే ప్రస్తుతం రామ్ చరణ్ కలెక్టర్, యంగ్ మాన్, ఓల్డ్ ఏజ్డ్ క్యారెక్టర్ తో పాటు చరణ్ లో ఇప్పటువరకు చూడని మరో డిఫరెంట్ వేరియేషన్ లో కూడా కనిపిస్తారు అని వార్తలు వస్తున్నాయ్.

అయితే ఇప్పటివరకు 30% షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇటీవలే అమృత్ సర్ లో కూడా కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమాకు మొదటి నుండి సినిమాటోగ్రాఫర్ గా తిరు అని మేకర్స్ ఇంతకుముందు అధికారికంగా ప్రకటించారు.కానీ అమృత్‌సర్ షెడ్యూల్‌లో రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారట.అయితే 4 షెడ్యూళ్ల కు సంబందించిన షూటింగ్ తర్వాత  వ్యక్తిగత సమస్యల కారణంగా తిరు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని అంటున్నారు. అయితే తిరు నెక్స్ట్ షెడ్యూల్ లో ఐనా జాయిన్ అవుతాడో లేదో చూడాలి.