సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అన్న తర్వాత హీరోయిన్లు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.హీరోయిన్లుగా అవకాశాలు పొందడం కోసం కొందరు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోగా మరికొందరు సినిమాలలో గ్లామర్ షో విషయంలో కూడా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి ప్రియమణికి సైతం ఇలాంటి చేదు అనుభవమే ఎదురయిందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఈమె నితిన్ హీరోగా ద్రోణ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక పాటలో భాగంగా ప్రియమణికి స్విమ్ సూట్ ధరించమని దర్శక నిర్మాతలు సూచించారట.
ఇలా దర్శకనిర్మాతలు స్విమ్ సూట్ ధరించమని చెప్పడంతో చేసేదేమీ లేక ఈమె స్విమ్ సూట్ ధరించిందని అయితే ఇలాంటి డ్రెస్ ధరించడం కోసం తను నిర్మాతలను మరింత డబ్బు డిమాండ్ చేసిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ద్రోణ సినిమా నిర్మాత ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పాట షూటింగ్ సమయంలో భాగంగా ప్రియమణిని స్విమ్ సూట్ ధరించమని చెప్పిన మాట వాస్తవమేనని తెలిపారు.
ఇలా దర్శకుడు స్విమ్ సూట్ ధరించాలి అని చెప్పినప్పుడు ఐదు నిమిషాల పాటు ఆలోచించిన ప్రియమణి తాను స్విమ్ సూట్ ధరించడానికి సిద్ధమేనని తెలిపారు.అయితే స్విమ్ సూట్ ధరించడానికి ఆమె అదనంగా డబ్బులు డిమాండ్ చేసిందనే వార్తలలో ఏ మాత్రం వాస్తవం లేదని తాను ఎలాంటి డబ్బు డిమాండ్ చేయలేదని ఈ సందర్భంగా నిర్మాత వెల్లడించారు.ఈ సినిమా కోసం ప్రియమణి తనవంతు కష్టపడి తన పాత్రకు న్యాయం చేసిందని అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేక పోయిందని నిర్మాత తెలియజేశారు.