అమ్మ అనే పిలుపుకు నయనతార దూరమయ్యారా… షాకింగ్ డెసిషన్ తీసుకున్న విఘ్నేష్..?

కోలీవుడ్ లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోలతో సమానంగా నయనతార గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఆమె అభిమానులు ముద్దుగా ఆమెకు లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చిన నయనతార ఆ తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో పవర్ఫుల్ యాక్షన్ సినిమాలలో నటించడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు పొందింది.

నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మారిపోయింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో నయనతార ప్రథమ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా నయనతార ఇటీవల తన ప్రియుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఆరు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరు రెండు నెలల క్రితం పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇటీవల ఈ జంట న్యూయార్క్ లో హనీమూన్ కూడా ఎంజాయ్ చేశారు. ఈ హనీమూన్ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను నయనతార సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది.

అయితే ఇటీవల ఈ జంట గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందు వల్ల ఆమె పిల్లలకు జన్మనివ్వడం కష్టమని డాక్టర్లు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నయనతారకు మొదటి నుంచి గర్భసంచి వీక్ గా ఉండటం వల్ల ఆమె గర్భం దాల్చడానికి వీలులేదని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది . దీంతో వీరు ఓ అనాధ బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధపడి పెళ్లి ముందే ఈ విషయాన్ని నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కనాలని అనుకున్నా కూడా విగ్నేష్ శివన్ అందుకు ఒప్పుకోలేదని సమాచారం. దీంతో నయనతార అసలైన తల్లి ప్రేమకు నోచుకోలేదని వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.