విగ్నేష్ శివన్ కు నయనతార ఫెరారీ కారు గిఫ్ట్ గా ఇచ్చిందా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతోంది తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇక వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం కూడా చేసుకున్నారని,రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విధంగా వీరు పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఈ జంట ఏమాత్రం స్పందించలేదు. ఇకపోతే తాజాగా నయనతార సమంత విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన కాత్తువాకుల రెండు కాదల్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే నయనతార విగ్నేష్ శివన్ ఇద్దరు కూడా లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకరికొకరు పెద్దఎత్తున గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవడం తరచు చేస్తూ ఉంటారు.

తాజాగా నయనతార తన ప్రియుడికి ఎంతో ఖరీదైన
ఫెరారీ కారు గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది. విగ్నేష్ శివన్
ఇన్స్టాగ్రామ్ ద్వారా రెడ్ కలర్ ఫెరారీ కారు వద్ద నిలబడి ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ కారును తన ప్రియురాలు నయనతార గిఫ్ట్ గా ఇచ్చారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.