అడల్ట్ కంటెంట్‌కి ‘కింగ్’ నాగ్ ‘నో’ చెప్పేశాడా.?

వెబ్ సిరీస్ అంటేనే అడల్ట్ కంటెంట్.. అన్న భావన చాలామందిలో వుంది. అది కొంత మేర నిజం కూడా. మొన్నామధ్య విక్టరీ వెంకటేష్ చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ గుర్తుంది కదా.? పచ్చి బూతుల పర్వం అది.!

కానీ, ఆ వెబ్ సిరీస్ కమర్షియల్‌గా బాగానే వర్కవుట్ అయ్యింది. అదే సమయంలో విక్టరీ వెంకటేష్‌కి చాలా చాలా చెడ్డ పేరు కూడా తీసుకొచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్‌లో.!

ఇంచుమించు అలాంటి వెబ్ సిరీస్ ప్రతిపాదన ఒకటి తాజాగా ‘కింగ్’ అక్కినేని నాగార్జున ముందుకొచ్చిందట. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశమట. అయితే, అందులోని అడల్ట్ కంటెంట్ విషయమై నాగార్జున ఒకింత గుస్సా అయినట్లు తెలుస్తోంది.

ఓ ప్రముఖ ఓటీటీ ఛానల్ అత్యంత భారీ స్థాయిలో సదరు వెబ్ సిరీస్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోందిట. అందులోని అడల్ట్ కంటెంట్‌ తాలూకు డోస్ కాస్త తగ్గిస్తే, చేయడానికి నాగార్జున ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మరి, డోస్ తగ్గిస్తారా.? తగ్గించకపోతే, నాగార్జున ప్లేస్‌లో వేరే ఆప్షన్ వుందా.? ఏమో మరి.! అన్నట్టు, నాగచైతన్య ఈ మధ్యనే ఓ వెబ్ సిరీస్‌లో దర్శనమిచ్చాడు. అది బాగానే వర్కవుట్ అయ్యింది లెండి.!

అన్ని వెబ్ సిరీస్‌లూ అడల్ట్ కంటెంట్‌తో వుండాలనే రూల్ లేదు.! కానీ, వెబ్ సిరీస్ అనగానే, ఆ అడల్ట్ కంటెంట్ అన్న తీపి మాత్రం కొందరికి వదలడంలేదు.!