ఎన్టీఆర్ షోలో మహేష్ బాబు ఎంత గెలుచుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

యంగ్ టైగర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి ఎంతో ఆదరణ ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ఈ కార్యక్రమం స్టార్ మాలో ప్రసారం అవుతూ వచ్చింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం అవుతూ ఎవరు మీలో కోటీశ్వరులు అనే పేరుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారమవుతుంది.

Ntr And Mahesh Babu | Telugu Rajyamఈ కార్యక్రమానికి కేవలం కంటెస్టెంట్ లు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా హాజరవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచడమే కాకుండా ఈ కార్యక్రమం రేటింగ్స్ కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సమంత, డైరెక్టర్ కొరటాల శివ, రాజమౌళి హాజరవుతూ ఎంతో సరదాగా ఎన్టీఆర్ తో ముచ్చట పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు ఎంతో చాకచక్యంగా సమాధానాలు చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడని గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ కార్యక్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిందని ఈ ఎపిసోడ్ డిసెంబర్ 2వ తేదీ ప్రసారం కానుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదికపై సందడి చేయనున్నారని తెలియడంతో ఈ హీరోల అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles