Hero Danush: సొంతింటి కోసం 300 కోట్లు ఖర్చు చేసిన ధనుష్..!

Hero Danush: తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు ప్రకటన చేసిన తర్వాత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 18 సంవత్సరాల నుంచి తన భార్య పిల్లలతో కలిసి ఉన్న ఇంటిలో ధనుష్ ఉండడం ఇష్టం లేక తను సొంతంగా ఓ ఇంటిని నిర్మించుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ధనుష్ కొత్త ఇంటి కోసం ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.తన భార్య ఐశ్వర్యతో విడాకులు ప్రకటన చేసిన తర్వాత ధనుష్ ఒక హోటల్లో నివసిస్తున్నారని ఆ ఇల్లు నిర్మాణం పూర్తి కాగానే ధనుష్ ఆ ఇంటికి మారుతున్నారని తెలుస్తోంది.

ఈ విధంగా విడాకుల ప్రకటన తర్వాత ఖరీదైన ఇంటిని, తన అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకుని ఆ ఇంటిలో ధనుష్ ఉండబోతున్నారు. ఏది ఏమైనా విడాకుల తర్వాత ఈ విధంగా అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మిస్తున్నట్లు తెలియడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదే కనుక నిజమైతే ధనుష్ కన్నా ఇప్పటి వరకు ఇంత ఖరీదైన ఇంటిని ఎవ్వరు నిర్మించలేదు కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే భారీ మొత్తంలో ఇంటికి ఖరీదు చేసే హీరోగా ధనుష్ ఉండిపోతారు.

గత 18 సంవత్సరాల క్రితం ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనస్సు 18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడిపి ఇలా ఉన్నఫలంగా, ఎవరు ఊహించని విధంగా విడాకులు ప్రకటన చేసి అందరికీ షాకిచ్చారు. అయితే వీరు విడాకుల ప్రకటనకు కారణం ఏమిటి అనే విషయం ఎవరికి తెలియక పోయినప్పటికీ వీరిద్దరూ తిరిగి కలిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.