టీజర్ టాక్ : డాషింగ్ ఏక్షన్ విజువల్స్ తో ధనుష్ “కెప్టెన్ మిల్లర్”

తమిళ నాట ఉన్న స్టార్ హీరోస్ లో తన నటనతో చిన్న ఏజ్ లోనే ఎంతో వెర్సటాలిటీ కనబరిచిన టాలెంటెడ్ హీరో ధనుష్ కూడా ఒకడు. మరి ఇప్పుడు ధనుష్ వరుసగా ఎన్నో సినిమాలు చేస్తుండగా వాటిలో తమిళ్ సహా తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తో చేస్తున్న తన కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “కెప్టెన్ మిల్లర్” కూడా ఒకటి.

ధనుష్ నుంచి భారీ పాన్ ఇండియా సినిమాగా దాదాపు మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై ఇన్ని రోజులు చిన్న డీటెయిల్స్ రివీల్ చేశారు. కానీ ఈరోజు అయితే ధనుష్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన టీజర్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళింది అని చెప్పాలి.

భారీ క్యాస్టింగ్ తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా విజువల్స్ కనిపిస్తుండగా బ్రిటీష్ సైన్యం తో ధనుష్ ఉండే ఒక చిన్న గ్రామం ప్రజలు ఎలా తిరగబడ్డారు అనే కోణంలో అయితే ఈ టీజర్ విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ టీజర్ కట్ లో కూడా కేజీఎఫ్ షేడ్స్ కనిపిస్తుండగా ఈ టీజర్ లో ఏక్షన్ విజువల్స్ కోసం మాట్లాడుకోవాలి.

భారీ మెషిన్ గన్స్ తో అలాగే ధనుష్ పై చాలా నాచురల్ విజువల్స్ ఇందులో కనిపిస్తున్నాయి. అలాగే యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తుంది. అంతే కాకుండా నటుడు శివ రాజ్ కుమార్, హీరో సందీప్ కిషన్ లు కూడా చాలా కీలక రోల్స్ చేస్తున్నట్టుగా అర్ధం అవుతుంది.

మొత్తంగా అయితే ఈ సెన్సేషనల్ టీజర్ కోలీవుడ్ సినిమా దగ్గర బిగ్ గేమ్ చేంజర్ ఏమన్నా అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ టీజర్ తోనే సినిమా అవైటెడ్ రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ఇచ్చేసారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.