శివ శంకర్ మాస్టర్ ఆర్థిక సహాయం పై స్పందించిన ధనుష్.. పబ్లిసిటీ నాకు నచ్చదంటూ కామెంట్స్!

తెలుగు తమిళ చిత్రాలలో ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించిన శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన హైదరాబాదులోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయనకు ఇన్ఫెక్షన్ అధికంగా ఉండటం వల్ల రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన చిన్న కుమారుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్న నటుడు సోనూసూద్ వెంటనే స్పందిస్తూ తన కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ క్రమంలోనే మరొక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది అతని పై ప్రశంసలు కురిపించారు.

ఇదిలా ఉండగా తాజాగా శివ శంకర్ మాస్టర్ కు తాను చేసిన సహాయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తను చేసిన ఆర్థిక సహాయం గురించి ఎవరు పబ్లిసిటీ చేయవద్దని, తనకు పబ్లిసిటీ అంటే నచ్చదని కామెంట్ చేశారు. ఇది ఆయన మంచి తనం అని చెప్పవచ్చు.ఇకపోతే మరికొందరు నెటిజనులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శివశంకర్ మాస్టర్ తెలుగు తమిళ చిత్రాలలో ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అయితే ఆయన ఆరోగ్య విషయంపై తమిళ బాలీవుడ్ నటులు స్పందించారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటులు ఎవరు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.