Dhanush : డైరెక్ట్ తెలుగు సినిమాలతో రచ్చ చేస్తున్న మారన్ హీరో.. మూడు సినిమాలను లైన్లో పెట్టేసాడట..!

Dhanush: తమిళ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. తమిళనాట నే కాకుండా మన తెలుగులో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ధనుష్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ విజయాలను అందుకున్నాయి. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తమిళ హీరోలు తెలుగు స్ట్రైట్ మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అని తెలిసినదే. ఇక ధనుష్ కూడా మూడు తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి తెలుగు డైరెక్ట్ మూవీస్ చేస్తున్నాడట.సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో తను డైరెక్ట్ గా తెలుగు సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు తొలిప్రేమ సినిమా తీసిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారట. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘సార్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. వెంకీ అట్లూరి సినిమా కంటే ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇంకొక సినిమా కి కూడా సంతకం చేశారట. కానీ శేఖర్ కమ్ముల సినిమా కంటే ముందు వెంకీ అట్లూరి సినిమాని పూర్తి చేస్తారట.

ఈ రెండు సినిమాలు తీస్తూనే మరొక తెలుగు సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం. దిల్ రాజు ధనుష్ కోసం ఒక కథని సిద్ధం చేయించారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అలరించబోతున్నారు అన్నమాట.