టాలీవుడ్ సినిమా దగ్గర గత నెల లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన చిత్రాలు అన్నీ కూడ దాదాపు హిట్ అయ్యాయి. కాగా ఇక ఈ ఫిబ్రవరి లో మహా శివరాత్రి పండుగ కానుకగా కూడా కొన్ని సినిమాలు రాగా ఈ చిత్రాల్లో స్టార్ హీరో ధనుష్ హీరోగా భీమ్లా నాయక్ ఫేమ్ నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన బై లాంగువల్ సినిమా “సార్” కూడా వచ్చింది.
తమిళ్ లో వాథి గా ఒకేసారి రిలీజ్ అయ్యిన ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి అదరగొట్టింది. ముఖ్యంగా తెలుగు వసూళ్లు ఎలా ఉంటాయి అనే దానికి అంచనాలు సరిగా మ్యాచ్ చేస్తూ మొదటి రోజు వసూళ్లు అందుకోగా రెండో రోజు నాటికి ఈ సినిమా మరింత బెటర్ వసూళ్లు రాబట్టినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి.
మరి మొదటి రోజు ఈ సినిమా ఏపీ మరియు తెలంగాణ లో 2 కోట్లకి పైగా షేర్ ని వసూలు చేయగా 4 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా రెండో రోజు కూడా సూపర్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరి మొదటి రోజు నైజాం లో 1.8 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఈ సినిమా రెండో రోజు ఏకంగా 2.56 కోట్ల గ్రాస్ ని రాబట్టడం విశేషం.
ఇక సీడెడ్ లో 80 లక్షలు, ఉత్తరాంధ్ర లో 78 లక్షలు మిగతా ఏపీ అంతా కలిపి 1.8 కోట్లు గ్రాస్ ని రాబట్టింది. దీనితో ఈ చిత్రం రెండో రోజు ఏపీ తెలంగాణాలో సుమారు 6 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. దీనితో రెండు రోజుల్లోనే ఈ సినిమా 10.5 కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం విశేషం. ఇక దీనితో రెండు రోజుల్లో 5 కోట్లకి పైగానే షేర్ ని సార్ రాబట్టింది. దీనితో ధనుష్ కి డైరెక్ట్ తెలుగు ఎంట్రీ లో సూపర్ వెల్కమ్ అందింది అని చెప్పుకోవచ్చు.