‘డెవిల్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల!

నందమూరి కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్‌’. ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తుండగా.. స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన కల్యాణ్‌రామ్‌, మాళవిక నాయర్‌, ఎల్నాజ్‌ నొరౌజీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లతో పాటు డెవిల్‌ టీజర్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లుగా ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త న్యూస్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ కోసం నయా అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్‌ను డిసెంబర్‌ 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్‌ విూడియా వేదికగా తెలిపింది.

ఇక ఈ సినిమాను డిసెంబర్‌ 29న పాన్‌ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ‘డెవిల్‌’ ముసుగేసుకుని బ్రిటీషర్ల కోసం కళ్యాణ్‌రామ్‌ ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్‌తో పీరియాడిక్‌ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. లుక్స్‌ పరంగా కళ్యాణ్‌ రామ్‌ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాడు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.