సినిమాలకు దూరంగా అల్లు అర్జున్ వారసులు.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న ఐకాన్ స్టార్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.పుష్ప సినిమా ముందు వరకు ఈయన సౌత్ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో ఈయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. నార్త్ ఇండస్ట్రీలో ఈయన క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఇలా ఒకవైపు సినిమాలలో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మరోవైపు ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడతారు.

అల్లు అర్జున్ కు కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్న విషయం మనకు తెలిసిందే. కొడుకుతో పోలిస్తే అర్హ ఎంతో ఆక్టివ్ గా చలాకీగా ఉంటున్నారు. ఇప్పటికే ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే అర్హ సైతం తన తల్లిదండ్రులతో ఎంతో క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ ఉన్నటువంటి వీడియోలను కూడా అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహ అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే నాలుగు సంవత్సరాల వయసులోనే సమంత నటించిన శాకుంతలం సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇంత చిన్న వయసులోనే వెండితెర ఎంట్రీ ఇచ్చిన అర్హ ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రం ఏంటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తన కొడుకు కూతురుని ఇకపై సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నారట. అయితే ప్రస్తుతం వీరిద్దరూ చిన్న పిల్లలు కావడంతో వీరి దృష్టి మొత్తం చదువు పైనే ఉండాలని చదువులు పూర్తి అయిన తర్వాత వారి ఇష్ట ప్రకారం ఇండస్ట్రీ కైనా లేదా వారికి ఇష్టమైన రంగంలో కొనసాగాలని భావించారట. అందుకే అల్లు అర్జున్ ముందు పిల్లల దృష్టిని సినిమాలపై కాకుండా చదువుపై ఉంచడం కోసం పిల్లలను సినిమాలకు దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది.అయితే అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం తెలిసిన అభిమానులు పిల్లల విషయంలో అల్లు అర్జున్ ఎంతో ముందు చూపుగా ఆలోచిస్తున్నారని భావిస్తున్నారు.