‘గేమ్‌ఛేంజర్‌’ విడుదలలో మరింత ఆలస్యం!?

‘ట్రిపుల్‌ ఆర్‌’ సినిమాతో ఇంటర్నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ తెచ్చుకున్న హీరో రామ్‌ చరణ్‌ తన తరువాతి సినిమాని సెన్సేషనల్‌ డైరక్టర్‌ శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’తో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమలో రామ్‌ చరణ్‌ డ్యూయల్‌ రోల్‌ నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్‌ జరపుకుంటున్న ఈ సినిమా ఒకనొక టైంలో 2024 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తారని ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూశారు. అంతేకాదు ఈ సినిమా గురించి అప్డేట్స్‌ ఇవ్వకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరింపు లేఖలు కూడా దర్శనం ఇచ్చాయి.

అయితే డైరక్టర్‌ శంకర్‌కు ఉన్న డిమాండ్స్‌ మేరకు షూటింగ్‌ ఇబ్బందులు, ఇంకా కొన్నిటెక్నీకల్‌ కారణాల వల్ల సంక్రాంతికి రిలీజ్‌ కాకపోడంతో పాటు ఎలాంటి అప్డేట్‌ కూడా ఇవ్వలేదు. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ ఎప్పుడనే విషయాన్ని మూవి టీమ్‌ సస్పెన్స్‌లో ఉంచుతూ.. షూటింగ్‌ విూద పోకస్‌ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ సందర్భంగా రాబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. త్వరలో మేకర్స్‌ అఫిసియల్‌ డేట్‌ అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది.

అయితే, అక్టోబర్‌లో దసరా కనుకగా రిలీజ్‌ చేస్తారని చరణ్‌ ఫ్యాన్స్‌ అశపడ్డారు. కానీ, ఇప్పుడు అది కూడా కష్టంగా మారిందని తెలుస్తుంది. ఎందుకంటే దసరాకి ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘దేవర’ సినిమా వస్తుండటంతో ‘గేమ్‌ చేంజర్‌’ మూవీని క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేయాలనీ డిసైడ్‌ అయినట్లు సమాచారం. డైరెక్టర్‌ శంకర్‌..కమల్‌ హాసన్‌ ‘ఇండియాన్‌ 2′ కూడా తెరకెక్కిస్తుండటంతో..’గేమ్‌ చేంజర్‌’ లేట్‌ కు అసలైన కారణం అని తెలుస్తోంది.

ఏదేమైనప్పటికీ వరల్డ్‌ వైడ్‌ గా ఫేమస్‌ అయిన చరణ్‌..తనదైన కోణంలో సినిమాలు తీసే శంకర్‌ కలిసొచ్చే ఈ సినిమా ఇండస్టీ ఆల్‌ టైం హిట్‌ గా చూడాలనేది ఫ్యాన్స్‌ కోరిక. ఈ సినిమాను స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు నిర్మిస్తుండగా..బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌ చంద్ర తదితరులు నటిస్తున్నారు.యస్‌ యస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు.