Shyam Singha Roy World Television Premiere : అప్పుడే బుల్లితెరపై “శ్యామ్” రాకకి డేట్ అండ్ టైం ఫిక్స్..ఎప్పుడంటే??

Shyam Singha Roy

Shyam Singha Roy World Television Premiere : రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి “శ్యామ్” టైటిల్ లో వచ్చిన రెండు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్టు ఒకటి బాక్సాఫీస్ ఫట్టు అయ్యిందని చెప్పాలి. ఆ సినిమాలే ఒకటి నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించిన చిత్రం “శ్యామ్ సింగ రాయ్” కాగా..

మరొక చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే లు హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం “రాధే శ్యామ్”. ఆ సినిమా మంచి హిట్ కాగా ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఈ చిత్రాల్లో ఇప్పుడు నాని చేసిన సినిమా శ్యామ్ సింగ రాయ్ ఫైనల్ గా బుల్లితెరపై ప్రసారం అయ్యేందుకు డేట్ మరియు టైం ని ఫిక్స్ చేసుకుంది.

గత కొన్ని రోజులు నుంచి బుల్లితెరపై జెమినీ టీవీ వారు ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఫైనల్ గా ఏప్రిల్ 3 ఆదివారం నాడు టెలికాస్ట్ అవ్వనున్నట్టు తాజాగా కన్ఫర్మ్ చేసారు. అలాగే ఆరోజు సాయంత్రం 6 గంటలకి సమయాన్ని ఖరారు చేశారు. మరి స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా మంచి టీఆర్పీ కూడా రాబట్టే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి “టాక్సీ వాలా” ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించగా మిక్కీ జె మేయర్ హిట్ ఆల్బమ్ ని అందించాడు.