వరల్డ్ వైడ్ “దసరా” ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అంటే.!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు “దసరా”. నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ భారీ సినిమాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అయితే తెరకెక్కించాడు.

మరి భారీ ప్రమోషన్స్ తో ఈరోజు రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఆల్రెడీ యూఎస్ లో వసూళ్లతో దంచి కొడుతుంది. దీనితో మొదటి రోజు రికార్డు వసూళ్లు కన్ఫర్మ్ అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇంతలా హైప్ తెచ్చుకున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆ రేంజ్ రిలీజ్ అయ్యిందా అంటే అయ్యిందనే తెలుస్తుంది.

వరల్డ్ వైడ్ గా అయితే ఈ సినిమా ఏకంగా 3000 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యిందని తెలుస్తుంది. వీటిలో సుమారు 600 నుంచి 700 ఓవర్సీస్ మార్కెట్ నుంచే ఉండగా తెలుగు స్టేట్స్ నుంచి 1500 అలాగే కన్నడ లో 120 మేర ఇక మిగతా ఆల్ మోస్ట్ అన్నీ హిందీ మరియు తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ సినిమాతో నాని తన వారీర్కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా దసరా తో వచ్చాడని చెప్పుకోవాలి. కాగా ఈ భారీ సినిమాకి అయితే కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు అలాగే ఎల్ ఎల్ వి సినిమాస్ వారు ఈ సినిమా వసూళ్లపైనే నమ్మకం పెట్టుకున్నారు.