భారీగా డ్రాప్ అవుతున్న “దసరా” వసూళ్లు.?

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన సూపర్ సెన్సేషనల్ హిట్ సినిమా “దసరా”. నాచురల్ స్టార్ నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ సినిమా కాగా దీనిని కూడా ఆర్ ఆర్ ఆర్, కాంతారా పుష్ప లాంటి సినిమాల రేంజ్ లో హిట్ అవుతుంది అని ప్రొజెక్ట్ చేస్తూ తీసుకొచ్చారు.

మరి ఈ సినిమా అనుకున్నట్టుగా మొదటి రోజు నుంచి మొదటి నాలుగు రోజులు కూడా రికార్డు వసూళ్లు నమోదు చేసి 100 కోట్ల గ్రాసర్ గా కుమ్మేసింది. అయితే ఈ 100 కోట్లు తర్వాత మాత్రం దసరా భారీగా డ్రాప్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఇక ఇపుడు కొత్త వారంలో కొత్త సినిమాలు కూడా రావడంతో మరింత గా సినిమా వసూళ్లు డ్రాప్ అయ్యినట్టుగా సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

కానీ మొదటి వారంలో అయితే దసరా తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్లకి పైగా షేర్ ని రాబట్టి ఓ సెన్సేషనల్ గా నిలిచింది. ముఖ్యంగా నిజామ్ లో అయితే దసరా కి 20 కోట్లకి పైగా షేర్ ని మొదటి వారంలోనే రాబట్టడం టైర్ 2 హీరోస్ లో బిగ్ రికార్డు గా మారింది. మరి ఈ వీకెండ్ లో మళ్ళీ దసరా ఏమన్నా పుంజుకుంటుందో లేదో కూడా చూడాలి.

మొత్తానికి అయితే దసరా కి అనుకున్న రేంజ్ భారీ లాంగ్ రన్ ఉండకపోయినా సినిమా మాత్రం మొదటి వారం లోనే దుమ్ము లేపే వసూళ్లు కొల్లగొట్టేసింది. పాన్ ఇండియా లెవెల్లో అనుకున్న రేంజ్ హిట్ అయ్యి ఉంటే ఈ సినిమాకి మరింత స్ట్రాంగ్ వసూళ్లు వచ్చి ఉండేవి.